గూడూరు న్యూస్( కిరణ్)
గూడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్సై రాజా కుళ్లాయప్ప ను శుక్రవారం గూడూరు నగర పంచాయతీ 20వ వార్డు ఇన్చార్జి ఇసాక్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. స్టేషన్ పరిధిలోని గ్రామాలలో నెలకొని ఉన్న అసాంఘిక సమస్యలపై దృష్టి సాగించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మధు రవి కూరగాయల చాంద్ సులేమాన్ మరియు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.






