గూడూరు న్యూస్( కిరణ్)
గూడూరు మండలం లోని కె. నాగలాపురం పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్సై అఖిల్ కుమార్ ను శుక్రవారం గూడూరు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. స్టేషన్ పరిధిలోని గ్రామాలలో నెలకొని ఉన్న అసాంఘిక సమస్యలపై దృష్టి సాగించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జె.సురేష్ తో పాటు బూడిదపాడు గ్రామం టిడిపి నాయకులు బంగారు శ్రీనివాసులు, రాముడు, భాస్కరు, శీను కార్యకర్తలు పాల్గొన్నారు.






