ఏడాదంతా కంటి వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ..
కిరణ్ 24×7 న్యూస్:
వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం నుంచి కోడుమూరు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమం..
పోస్టర్ ఆవిష్కరించిన వైయస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాటలో రాజకీయాల్లో అడుగుపెట్టిన కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ఎస్ఈసీ సభ్యులు, కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ప్రోత్సాహంతో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీ నుంచి ఏడాది పాటు నియోజకవర్గంలో కంటి వైద్య శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. జగనన్న బాటలో సేవా రాజకీయాలు..కంటి చూపుకు భరోసా.. ప్రతి ఇంటికి వైద్యం అన్న నినాదంతో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్లను శనివారం గూడురు పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ..కోడుమూరు నియోజకవర్గంలో ఏడాదంతా కంటి వైద్య పరీక్షలు చేసేందుకు వైయస్ జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21న శ్రీకారం చుడుతున్నామన్నారు.
ప్రతి గ్రామంలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అధినేత పుట్టినరోజును కేవలం వేడుకగా కాకుండా పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే సేవగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత అన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఈ ఏడాది ప్రారంభమయ్యే ఈ కంటి వెలుగు కార్యక్రమం, వచ్చే ఏడాది జగనన్న పుట్టినరోజు నాటికి వేలాది మందికి చూపును తిరిగి అందించి. వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వాహణకు కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఎంతగానో ప్రోత్సాహం అందించారని, ఈ నెల 18న పార్టీ అధినేత వైయస్ జగన్ చేతుల మీదుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారని తెలిపారు.
గూడూరు పట్టణం నందు మన అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు కోడుమూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.
ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు, కులమతాలకు అతీతంగా వైద్య సేవలు ఉచితంగా అందిస్తానని డాక్టర్ ఆదిమూలపు సతీష్‌గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లు పి ఎన్ అస్లాం, లక్ష్మన్న, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నందకిషోర్, కిషోర్, ఖలీల్, మద్దిలేటి, కోఆప్షన్ నెంబర్ దౌల, కేడీసీసీ మాజీ డైరెక్టర్లు సత్యాలు, రంగడు, రవి ప్రతాప్, అంజి, నాగరాజు, శ్రీను, మధు, వెంకటేష్, ప్రభాకర్, రవి, అంజి, రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.







