గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజ కుళ్లాయప్ప ను కలిసిన చైర్మన్, వైస్ చైర్మన్లు…
కిరణ్24×7 న్యూస్:
గూడూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజకులయప్పను గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం తమ పార్టీ నేతలతో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా కప్పి పూలదండలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మన్,వైస్ చైర్మన్ లు ఎస్సై రాజా కులయప్పతో మాట్లాడుతూ నగర అభివృద్ధి కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ లక్ష్మన్న కౌన్సిలర్లు ఖలీల్ భాష జింకల కుమార్ డ్రైవర్ మదిలేటి నందకిషోర్ టీచర్ కిషోర్ కో ఆప్షన్ సభ్యులు మదర్ సార్ వైకాపా నాయకులు జింకల నాగరాజు పత్తి రంగడు కొండి గిరి గిడ్డయ్య సత్యాలు చికెన్ వల్లి హబీబ్ రవి ప్రతాప్ పాముల శివ దండు శీను బోజుగు ప్రభాకర్ టక్కు మధు సింగనగిరి గిడ్డయ్య కోడిగుడ్ల రహీం పిఎన్ షఫీ సమీర్ శ్రీకాంత్ ఎం శివ పాముల రంగన్న ఇటికల షేక్షావలి నాసిర్ భాష సింగనిగిరి షీలా రేవుల గోవిందు తదితరులు పాల్గొన్నారు.







