*స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే:

కిరణ్ 24×7 న్యూస్:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలం నూతనపల్లి గ్రామం లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. స్వచ్ఛత ద్వారా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, ప్రజలందరూ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

ప్రతి కుటుంబంలో ఒకరు శుభ్రత కోసం బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కింద ఒక పేరు ని పెట్టుకొని స్వచ్చత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా ఈ నెల *పర్యావరణంలో యువత* అని పేరు తో యువతని భాగస్వామ్యం చేయడం జరుగుతుందని ఇదంతా చేయడం ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించుకొని ప్రజలు ఆరోగ్యంగా ఆహ్లాద వాతావరంలో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యం అని తెలియజేశారు.
గ్రామాల్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు గా నిర్వహించడం, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే పసుపుల గ్రామ పంచాయతీ ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్ లో జిల్లాలో రెండు పంచాయతీలకు రావడం అందులో మన పసుపుల పంచాయతీ కి రావడం గర్వించదగ్గ దగ్గ విషయం అని ముఖ్యంగా మా అమ్మ శీలమ్మ సర్పంచు గా ఉన్న సమయంలో రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు.అలాగే అలాగే రేపు ఆదివారం రోజున పోలియో చుక్కలు ప్రతి ఒక్కరు ఐదు ఏండ్ల వయసు వరకు ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు , సమాజం బాధ్యత వహించి వేయించాలని పిలుపునిచ్చారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా రాయలసీమ యూనివర్సిటీ , కర్నూలు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు .

ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా ఈ నెలలో నూతన పల్లి గ్రామాన్ని ఎంచుకొని ఎయిడ్స్ పైన అవగాహన కల్పించడం, మెడికల్ క్యాంప్ పెట్టడం, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడం,ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేయడం,మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ప్రజలు కూడా ఈ సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి , ఎంపీడీవో రఘునాథ్, డి ఎల్ డి ఓ రమణారెడ్డి , పంచాయతీ సెక్రటరీ హేమంత్ కుమార్ రెడ్డి , ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ శివ ప్రసాద్ ,మున్సిపల్ సిబ్బంది ,స్థానిక కూటమి నాయకులు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.