జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్” సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని జోహారాపురం, ఇందిరమ్మ గృహాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. కర్నూలు ఒకటవ పట్టణ సిఐ పవన్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
క్రిష్ణగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎరుకలచెరువు, క్రిష్ణగిరి, టి. గోకులపాడు, తోగర్చేడు లలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. క్రిష్ణగిరి ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి మరియు పోలీసులు పాల్గొన్నారు.ఆదోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్వతీపురం, అమరావతినగర్, రాయనగర్, పై కోట్టాలా మరియు క్రిందికోట్టాలా గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసులు కవాతు నిర్వహించారు. ఆదోని ఒకటవ పట్టణ సిఐ తేజమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఆదోని రూరల్ సర్కిల్ పరిధిలోని నెట్టెకల్, సాంబగల్లు, చిన్న పెండెకల్లు గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
ఆదోని రూరల్ సిఐ నిరంజన రెడ్డి, ఎస్సైలు ఎర్రిస్వామి, శ్రీనివాసులు, చిన్నపీరయ్య మరియు పోలీసులు పాల్గొన్నారు.






