కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ మాధవ స్వామి కళ్యాణం ను భక్తులు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణమును భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళ తాళాలతో భక్తులు ఘనంగా ఊరేగించారు. స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోడుమూరు పోలీస్ సిబ్బంది భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు.