కిరణ్ 24×7 న్యూస్:

కర్నూలు జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ .డి. విష్ణువర్ధన్ రెడ్డి  కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు. బొగ్గుల దస్తగిరి  ఆదేశాల మేరకు గూడూరు మండలం బూడిదపాడు గ్రామంలో నందమూరి తారక రామారావు  30వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జే.సురేష్  పాల్గొని ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మహా నాయకుడు శ్రీ.నందమూరి తారక రామారావు  30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము.

తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవునిగా పూజిస్తూ ఉండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. మీరు భౌతికంగా మాకు దూరమై ఇన్నేళ్లయినా తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు.

ఘనంగా నివాళులర్పిస్తున్న టిడిపి నేతలు

ఈ కార్యక్రమంలో బంగారు శ్రీనివాసులు, రాముడు, వెంకటేశు,రామాంజనేయులు, బుగ్గన్న, ఈరన్న,సంజీవరెడ్డి, భాస్కర్, ఏసన్న తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీ పాల్గొని నివాళులర్పించడం జరిగింది.