కిరణ్ 24×7 న్యూస్:
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని వాల్మీకి దేవాలయం ప్రాంగణంలో విష్ణు సేన ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి.

ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై, పోటీలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

ఈ పోటీల్లో దాదాపు 85 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ సాంస్కృతిక ప్రతిభను అద్భుతమైన ముగ్గుల రూపంలో ప్రదర్శించారు.

పోటీలను పరిశీలించి విజేతలను ప్రకటించేందుకు గూడూరు ఎస్‌.ఐ రాజకుళ్లాయప్ప ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఎస్‌.ఐ రాజకుళ్లాయప్ప పోటీల్లో పాల్గొన్న అన్ని ముగ్గులను పరిశీలించి ఆరుగురు విజేతలను ప్రకటించారు.

విజేతలు:

మొదటి బహుమతి: దివ్య – ₹10,016/-

రెండవ బహుమతి: నందిని – ₹8,016/-

మూడవ బహుమతి: పద్మజ – ₹5,016/-

నాలుగవ బహుమతి: యశోద – ₹3,000/-

ఐదవ బహుమతి: అనూష – ₹2,016/-

ఆరవ బహుమతి: సౌజన్య – ₹1,016/-

ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు గూడూరు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక బహుమతులు అందజేశారు.
ప్రత్యేక బహుమతులు:

రితికా కు – గూడూరు ఎస్‌.ఐ రాజకుళ్లాయప్ప – ₹1,116/-

మాధవి కి – కానిస్టేబుల్ మల్లి – ₹777/-

శాంభవి కి – డ్రైవర్ షఫీ – ₹516/-
, ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 85 మంది మహిళలకు ఒక్కొక్కరికి చీరను బహుమతిగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం మహిళల సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, సంక్రాంతి పండుగకు ప్రత్యేక శోభను చేకూర్చింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కె. రామాంజనేయులు, సింగల్ విండో చైర్మన్ దానమయ్య,సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్, బి. సృజన్, కౌన్సిలర్లు మల్లాపు బుడ్డంగలి, కోడుమూరు షాషావలి, కుమ్మరి ఎల్లయ్య, నీటి సంఘం అధ్యక్షులు నాయుడు, వాల్మీకి సంఘం అధ్యక్షులు బాబు, విద్యా కమిటీ చైర్మన్ కర్ణ, నాయకులు వీర, మద్దిలేటి, శ్రీనివాసులు, శేఖర్, సుకుమార్, కార్తీక్, వెంకటేష్, గిడ్డయ్య, అయ్యన్న, అబ్రహం, వినోద్, తిమ్మోతి, ఇబ్రహీం, అద్దు, నాగప్ప యాదవ్, నరసింహులు, మన్నన్ బాష, సులేమాన్, ఉగ్ర, పెద్ద చాంద్, రేవుల మద్దిలేటి, రఘు, అయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.