ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..

కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ఎం దౌలత్ ఖాన్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు శరత్ బాబు అధ్యక్షతన గూడూరు మండల తాసిల్దార్ వెంకటేశ్వర నాయక్ ఎస్సై రాజ కుల్లాయప్ప కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గూడూరు నగర పంచాయతీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వ్యవసాయ కార్యాలయం హౌసింగ్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఏపీడబ్ల్యుజే ఎఫ్ యూనియన్ అధ్యక్షులు దౌలత్ ఖాన్ తో పాటు సభ్యులందరూ తాసిల్దార్, కమిషనర్, పోలీస్ స్టేషన్ ఎస్ఐ లను శాలువాలు కప్పి పూలదండలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విలేకరులు మహబూబ్ బాషా,కిరణ్, లతీఫ్, షేక్ షావలి, రాజశేఖర్, ఇసాక్, ఇస్మాయిల్, ఎర్రన్న పాల్గొన్నారు.