గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
కిరణ్ 24×7 న్యూస్:

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం రిజిస్టార్ కార్యాలయం ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్టార్ హాజరైన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు వందనం గావించారు.

ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్స్ నుండి విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు,ఈ సందర్బంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి ఇచ్చిన విలువలు, హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తించి పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ప్రతీకగా నిలుస్తుందని, నైతిక విలువలు, పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ మరియు డాక్యుమెంటరీ కాలనీ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.