గూడూరు పట్టణంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు…
కిరణ్ 24×7 న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, కేడీసీసీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాలతో శుక్రవారం కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం టీడీపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు కె. రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీ నారా లోకేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేసి మానవతా భావాన్ని చాటారు.

ఈ సందర్భంగా కె. రామాంజనేయులు మాట్లాడుతూ, నేటి యువతకు ఆదర్శప్రాయమైన నాయకుడిగా నారా లోకేష్ రాష్ట్ర ఐటీ, విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. దూరదృష్టితో కూడిన పాలన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్, యువ నాయకుడు బోజుగు సృజన్, కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి, మాజీ కౌన్సిలర్లు అడివేప్ప, పెద్ద చాంద్, కె. వీర కుమార్, నాగప్ప యాదవ్, వాల్మీకి దేవాలయం అధ్యక్షులు పుట్టపాశం బాబు, శివ, శివ మద్దిలేటి, తిమోతి, రఘు, కార్తీక్, రంగడు, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








