మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం… గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ,..
కిరణ్ 24×7 న్యూస్:
జనవరి నెల 18-01-2026 తేదీన పొన్నకల్ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో, 21-01-2026 తేదీన ఫిర్యాదుదారురాలు బాలికతో కలిసి గూడూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి రాతపూర్వక నివేదికను సమర్పించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం మరియు ఫిర్యాదు ఆధారంగా, ఈ కేసును ‘మిస్సింగ్ కేసు’ నుండి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 87 r/w 3(5) మరియు పోక్సో చట్టం (POCSO Act) సెక్షన్ 3(a), 4 కిందకు మారుస్తూ తీవ్రమైన నేరంగా నమోదు చేయడం జరిగింది.

బాధితురాలిని తక్షణమే కోడుమూరు సి.హెచ్.సి (CHC) వైద్యుని వద్దకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించడమైనది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ఆర్‌.ఎఫ్‌.ఎస్.ఎల్ (RFSL) కు పంపడం జరిగింది.
అదే విధంగా వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre) లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ ద్వారా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడం జరిగినది. అనంతరం గౌరవనీయ మెజిస్ట్రేట్ ఎదుట బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయించడం జరిగింది.

బాలికకు మానసిక ధైర్యాన్ని అందించేందుకు మరియు కౌన్సెలింగ్ నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కి పంపడం జరిగింది.
దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన A1 ని అరెస్ట్ చేయడం జరిగినది. నిందితుడిని కర్నూలులోని గౌరవనీయ జె.ఎం.ఎఫ్.సి (JMFC) ప్రత్యేక మొబైల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది.

మహిళలు మరియు పిల్లల రక్షణ విషయంలో గూడూరు పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
~ఎస్‌.ఐ, గూడూరు PS