అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైయస్ఆర్‌సీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్..
కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సతీష్ మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ తదితర పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం తేరుబజారు – లింగమయ్య ఇంటి సమీపం నుండి ఊరేగింపును నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణతో పరిసర ప్రాంతాలను మార్మోగించారు. డప్పులు, మంగళవాయిద్యాల మధ్య నిర్వహించిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో కోడుమూరు పట్టణం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







