* ముఖ్యమంత్రి  పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత .

* పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .

* అందరూ సమన్వయంతో పని చేయాలి.

* ట్రాఫిక్ నియంత్రణ , రూట్ బందోబస్తు అత్యంత కీలకం.

* ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

కిరణ్ 24×7 న్యూస్:

2026 ఫిబ్రవరి 6 న ( శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు  ఎమ్మిగనూరు మండలం , కలుగొట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో కలుగొట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి  బహిరంగ సభ దగ్గర కు బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి కర్నూలు ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు.

సిఎం గారి పర్యటనలో క్షేత్రస్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు సెక్టార్ల వారీగా అప్రమత్తంగా ఉండాలన్నారు.

కేటాయించిన విధులలో భాద్యతయుతంగా ఉండాలన్నారు.

ముఖ్యమంత్రి  పర్యటించే రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, హెలిప్యాడ్, సభ ప్రాంగణం తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు.

వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి  పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ , రూట్ బందోబస్తు అత్యంత కీలకమన్నారు.

ముఖ్యమంత్రి  పర్యటించే మార్గాల్లో సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు.చేయకూడనవి, చేయవలసిన వాటి గురించి తెలిపారు.

అనంతరం కర్నూలు ఎస్పీ  హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు CM  కాన్వాయ్ రిహార్సల్స్ ట్రయల్ రన్ ను పరిశీలించారు.

కాన్వాయ్ రిహార్సల్స్ ట్రయల్ రన్ లో భద్రతా పరమైన అంశాలను పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు యుగంధర్ బాబు, కృష్ణమోహన్ , కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.