గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య
పట్టించుకోని అధికారులు…
కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు అధికం కావడం తో స్థానిక ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగాని క్రిమిసంహారక మందుల షాపుల యజమానులు ప్రధాన రహదారి లో లారీలతో మందుల బస్తాలు కొనుగోలు కోసం ట్రాఫిక్ సమస్య కు కారణం అవుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా చిరు వ్యాపారులు తోపుడు బండ్లు, మోటారు సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. దీని కారణంగా చిన్న లారీలు, ఆటోలు రహదారిపై ఎదురుపడితే పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. క్రిమిసంహారక మందుల షాపు యజమానులు గోడౌన్లను ఊరి చివర పెట్టుకొని మందులను, ఎరువులను విక్రయించు కోకుండా నడిరోడ్డు పై లోడు లారీలను ఆపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. కావున సంబంధిత అధికారులు పోలీసు వారు ట్రాఫిక్ పై దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజల మరియు ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.






