శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమాలు..
కిరణ్ 24×7 న్యూస్:
శ్రీశైల క్షేత్రానికి తరలి వెళ్లిన శివ భక్తులు ప్రజలకు సోమవారం నుండి శివ స్వాములు మరియు నీలకంఠేశ్వర భక్త బృందం సభ్యులు శ్రీశైల క్షేత్రంలోని బాల గణేష్ పార్కు వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు . ఈ సందర్భంగా కార్యానిర్వహకులు మరియు మాజీ జెడ్పిటిసిఎల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
గూడూరు పట్టణానికి చెందిన శివ స్వాములు భారీ సంఖ్యలో శ్రీశైలానికి తరలి వస్తున్నారని.శ్రీశైలం చేరుకున్న వారికి సోమవారం నుండి శివరాత్రి రోజు వరకు దాదాపు 7 రోజులు శ్రీశైలంలోని బాల గణేష్ పార్క్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు, గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న గూడూరు నగర పంచాయతీ పట్టణ దాతలకు, గ్రామ పెద్దలకు శివ స్వాముల కుటుంబాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు.






