కిరణ్ 24×7 న్యూస్:
ముఖ్యమంత్రివర్యులు .నారా చంద్రబాబునాయుడు , ఐటీ,విద్యాశాఖ మంత్రివర్యులు . నారా లోకేష్ బాబు ,కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు. బొగ్గుల దస్తగిరి, కర్నూలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్.డి.విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సహకార సంఘ చైర్మన్ బి.దానమయ్యా. కోడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలోని 1వార్డ్ లో పెన్షన్లు ఇంటింటికి తిరిగి గూడూరు సహకార సంఘ చైర్మన్ బి.దానమయ్యా పంచడమైనది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు/ వితంతువులకు 4000 రూపాయలు, దివ్యాoగు లకు/ కుష్టి వ్యాధిగ్రస్తులకు 6000 రూపాయలు, కిడ్నీ/ కాలేయము/ తల సేమియా బాధితులకు 10000 రూపాయలు, పూర్తి వైకల్యం ఉన్నవారికి 15000 రూపాయలను ఒకరోజు ముందుగానే ప్రతి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయం సిబ్బంది పాల్గొనడం జరిగింది.






