Kiran24x7 news:
*కర్నూల్ మండలం నూతనపల్లి గ్రామంలో రైతన్నా -మీకోసం మరియు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం వలన 18-03-2026 మూడవ రోజు డోర్ టు డోర్ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.*
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు ముందుగా కమ్మరి వరలక్ష్మి గారికి 76,000 రూ.ల CMRF చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడం జరిగిందని తెలిపారు.
రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి బాట వేస్తుందని పేర్కొంటూ, రైతులు బలంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఎమ్మెల్యే గారు అన్నారు. మొత్తం మీద 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 8985 కోట్ల రూపాయలను సుమారు 46 లక్షల రైతులకు మూడు విడతలుగా అందిచడం జరిగింది అన్నారు. ముఖ్యంగా కోడుమూరు
నియోజవర్గానికి ప్రతి విడతలో 35052 రైతులకి సుమారు 19.72 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు.అలాగే రైతన్నా మీకోసం ద్వారా కూటమి ప్రభుత్వం పంచ సూత్రాలతో రైతులకు ఉపయోగపడేలా ముందుకెళ్తుందని తెలియ జేసారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ సంక్షేమాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ సమయంలో పశు వైద్యశాలను సందర్శించి అక్కడ ఉన్న పశువులకు ఇంజక్షన్ వేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు,వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







