డిమాండ్ల సాధనకై దళిత సామాజిక ఉద్యమ నాయకుల సమావేశం..
Kiran24x7news:
యస్ సి హోదా రద్దు చేయడం కాదు – కుల వ్యవస్థనే రద్దు చేయాలి.”. దళిత సామాజిక ఉద్యమ నాయకులు బి సుభాకర్ మాదిగ, దళిత క్రైస్తవుల సమావేశం లో డిమాండ్ చేశారు. గూడూరు శ్రీ భూమాత రైతు సంఘం కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ..
దళిత క్రిస్టియన్ లను షెడ్యూల్డ్ కులం వ్యక్తి గా పరిగణించడం కుదరదు అని మార్చి 24 2026 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.
భారత సుప్రీంకోర్టు గత షెడ్యూల్ కులం హోదా కు సంబంధించి ఇచ్చిన తీర్పు దేశం వ్యాపితంగా పెద్ద సంచలనం, చర్చకు కు దారితీసింది.
” హిందూ – మాదిగ” షెడ్యూల్డ్ కులానికి చెందిన క్రిష్టియన్ ఫాస్టర్ చింతాడ ఆనంద్, తన మీద పదేపదే దాడులు జరుగుతున్నాయని, కులం పేరుతో దూషిస్తున్నారని, అట్టి వారిని శిక్షించాలని కోరుతూ షెడ్యూల్డ్ కులాల మరియు ట్రైబుల పై( అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 క్రింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. ఆనంద్ క్రైస్తవ మతస్థుడు కనుక ఎస్సీ ఎస్టీలపై ( అత్యాచార నిరోధక) చట్టం 1989 వర్తించదని చెబుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసును కొట్టివేసింది. ఆనంద్ ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును నిర్ధారించింది; ఆనంద్ అప్పీలు కొట్టివేసింది. 
సహజంగానే షెడ్యూల్ కులాల వారు, సామాజిక అణిచివేత గురవుతున్న వారికి ప్రత్యేక రక్షణాలు ఉండి తీరాలన్న వైఖరి గల వారందరూ సుప్రీంకోర్టు తీర్పును చాలా గట్టిగా విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు.
తీర్పు చాలా అన్యాయమైందే, సందేహం లేదు. కానీ జడ్జీలను కులం పేరుతో తప్పు పట్టడం సరైనది అవునా, కాదా అనే విషయాన్ని జడ్జీలు ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు మన్మోహన్ తమ తీర్పులో రాజ్యాంగంలోని అధికరణం 341 క్లాసు 3 ( షెడ్యూలు కులాల)1950 నిర్దేశం ప్రకారం తీర్పు ఇచ్చామని చెప్పారు. ఈ నిర్దేశం ఇలా చెబుతుంది: “హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు కాకుండా వేరే మతాన్ని అవలంబిస్తున్న వారెవ్వరినీ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా భావించరాదు.” న్యాయ స్థానాలు రాజ్యాంగం పరిధిలోనే తీర్పునివ్వాలి. రాజ్యాంగం చాలా స్పష్టంగా షెడ్యూల్డ్ కులం హోదా హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని అస్ఫృలకు (కులాల జాబితా కూడా దేశాధ్యక్షుడి నిర్దేశం లో ఉంది) కాకుండా ఇంకెవ్వరికీ వర్తిచందు అని కరాకండిగా చెప్పిన తర్వాత, న్యాయ పీఠంపై కూర్చున్న జడ్జి ఏ కులంలో పుట్టిన వ్యక్తి అయినా మార ఇప్పుడు ఇచ్చిన తీర్పు కన్నా భిన్నమైన తీర్పు ఇవ్వడం కుదురుతుందా?
నా దృష్టిలో, కుల వ్యవస్థను నిరాకరించిన బౌద్ధ, సిక్కు మతాలను క్లాసు 3 లో చేర్చి, క్రైస్తవం,ఇస్లాం లను చేర్చక పోవడడం 1950 నాటి నుంచి నేటివరకు పార్లమెంట్ – “కేవలం మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధిస్తున్ళ.రాజ్యాంగం ఆర్టికల్ 15” ఒకటికి మూడు సార్లు ఉల్లంఘించించని నిర్ధారణ అవుతుంది.
ఈ అక్రమాన్ని ప్రశ్నిస్తూ వేసిన కేసులు తీర్పు కోసం ఎదురు చూస్తూ కోర్టుల్లో 20 సంవత్సరాలు గా అలా పడి ఉన్నాయి. కనుక, న్యాయ వ్యవస్థతో సహా మొత్తం రాజ్యం అగ్రవర్ణ/అగ్రకులాల అధీనంలో ఉండటమే ఈ అన్యాయానికి పాల్పడిందని చెప్పాలి.
ఈ తీర్పు రద్దు అయ్యే అవకాశం ఉందా?
ఉంది! ఈ తీర్పు, గతంలో వచ్చిన ఇలాంటి తీర్పులన్నీ రద్దు కావాలంటే రాజ్యాంగ అధికరణం 341, 342 ల్లోని క్లాజు 3 ను రాజ్యాంగం preamble spirit కు, అధికరణం 15 కి అనుగుణంగా పార్లమెంటు సవరణ చేయాలి .

అందుకోసం, పార్లమెంటులోని వివిధ కమ్యూనిస్టులు, వివిధ పార్టీలకు చెందినప్రజాస్వామిక వాదులు మరియు దళిత, బహుజన, మైనారిటీ మతాల సభ్యులందరూ ఒక తాటిపైకి వచ్చి రాజ్యాంగ అధికరణం 341, 342 ల్లోని క్లాజు 3 ను ‘అస్పృశ్య కులం మూలం’ కలిగిన వ్యక్తి ఏ మతాన్ని స్వీకరించినప్పటికీ షెడ్యూల్ క్యాస్ట్ హోదా యధాతధంగా ఉంటుంది’ అనే రాజ్యాంగ సవరణ కోసం మహోదృత ఉద్యమాన్ని నిర్మించి రాజ్యాంగ సవరణ సాధించగలిగితే ఈ తీర్పు ఆటోమేటిక్ గా రద్దు అవకాశం కలదు.తీర్పును తప్పు పట్టిన పార్టీలన్నీ – కాంగ్రెస్, సిపిఐ(ఎం), బీఎస్పీ, ఆర్బిఐ, వైయస్సార్సీపి, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తదితర పార్టీలన్నీ సమిష్టిగా ఆ కృషిని అఖిల భారత స్థాయిలో ప్రారంభించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం లో దళిత క్రైస్తవ నాయకులు గూడూరుసంఘ మాజీ సెక్రటరీ, శ్యామసుందర్, పాముల రాజశేఖర్, సంఘ పెద్దలు, గజ్జన్న గారి శేఖర్, సంఘ పెద్ద హాలెను కుమార్,బొరుసుజాస్వా, యూత్ క్వోయర్ డైరెక్టర్ యేసు, గూడూరు నగర అభివృద్ధి కమిటీ కన్వీనర్ పైగేరి నాగరత్న రావు, మాజీ వార్డ్ మెంబెర్ భోజుగు లాజర్, సువార్త కమిటీ సభ్యులు మీకాయేల్ తదితరులు పాల్గొన్నారు.






