కోడుమూరులో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల పార్టీల నాయకులు కార్యకర్తలు శుక్రవారం ఫ్లకార్డులతో కోడుమూరు రహదారిలో వారు నిరసనను వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బి రాజు సిపిఎం మండల కార్యదర్శి గఫూర్మియా సిపిఎం పార్టీ చేనేత జిల్లా కార్యదర్శి సిఐటియు నాయకులు ఈరన్న ఆటో వర్కు శీనన్న నాయకులు జిల్లా అధ్యక్షుడు మధు చిన్న చిన్న బజారు అమాలి సంఘం నాయకులు అక్బర్ బాషా రై సంఘం నాయకులు రాజు మరియు కార్మికులు నేతలు పాల్గొన్నారు.






