*కోడుమూరు లో వైసిపి జెండా ఎగరడం ఖాయం*
kiran24x7news:-
పి.రుద్రవరం గ్రామంలో వైఎస్సార్ సీపీ ఇంటింటికి ప్రచారం….
కర్నూలు మండలం పి.రుద్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారు, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు.. 
ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి.
ఈ సందర్భంగా అతిధులను పి.రుద్రవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు..ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పేద ప్రజల పక్షాన ఉంటూ, పేదలకు మేలు చేసిందని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు..
ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి, కుడా చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి..
పేద ప్రజలయిన పెన్షన్ దారులను ఇబ్బందికి గురిచేసేలా కుట్రలు చేసిన చంద్రబాబు కు ప్రజలు ఓట్ల రూపంలో, తగిన బుద్ధి చెప్పాలని, కూటమి నాయకుల డిపాజిట్ లు గల్లంతు అయ్యేలా తీర్పు ను ఇయ్యాలని పిలుపునిచ్చారు..అలాగే రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, జెడ్పిటిసి ప్రసన్న కుమార్, వైస్ ఎంపిపి నెహేమియా, సర్పంచ్ మధుసూదన్, గొందిపర్ల సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ మండల ఉపాధ్యక్షులు ఉల్చాల డి వాసు, మండల కన్వీనర్ మహబూబ్ బాషా, వినయ్ కుమార్ రెడ్డి, ఎంపిటిసి హనుమంతు, రైతు రాష్ట్ర విభాగం కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ మహేశ్వర రెడ్డి, శేషి రెడ్డి, వెంకటేశ్వర్లు, గుడిపాడు లక్ష్మికాంత రెడ్డి, ఏసేపు, సురేష్, మాజీ ఎంపీటీసీ చిన్న లక్షన్న, మోహన్ బాబు, బోజ్జన్న, కేశవరెడ్డి, ఎల్లమ్మ దేవాలయ బోర్డు మెంబెర్ మధు శేఖర్, సచివాలయ కన్వీనర్ అనీల్ బాషా, ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ ప్రసాద్, దావీద్, ప్రభుదాస్, శేఖర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..






