kiran24×7news …
భారతదేశ విముక్తికై ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరులు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు విప్లవ జోహార్లు…..(సీఐటీయూ)
భగత్ సింగ్, రాజ్ గురు, శుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా గూడూరు లోని సిఐటియు కార్యాలయంలో మరియు చనుగొండ్ల గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో వర్ధంతి సభ లు నిర్వహించడం జరిగింది,, గూడూరు లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి జే,మోహన్, మండల నాయకురాలు ప్రభావతి, చనుగొండ్ల గ్రామంలో సిఐటియు మండల అధ్యక్షుడు గుంట ప్ప, డివైఎఫ్ఐ నాయకులు సుధాకర్లు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది,, ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి జే,మోహన్, మండల అధ్యక్షుడు గుండప్ప, మండల నాయకురాలు ప్రభావతి, డివైఎఫ్ఐ నాయకులు సుధాకర్లు మాట్లాడుతూ… 23 సంవత్సరాల చిన్న వయసులోనే బ్రిటిష్ కబంధహస్తాల నుండి భారత దేశ విముక్తికై బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి ఉరికంబన్నీ ముద్దాడిన వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని, భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన విప్లవ వీరులని, అటువంటి వీరులను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా, యువత వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని, నాడు బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశ ప్రజలను బానిసలుగా చేసుకొని ఇటువంటి దాడులు చేసిందో , నేడు దేశంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసిందని, ప్రతి సంవత్సరం నిరుద్యోగులు పెరుగుతున్నారే తప్ప ఉద్యోగ అవకాశాలు కేంద్ర ప్రభుత్వం కల్పించడం లేదని, అదేవిధంగా కార్మికులు తమ ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలను రద్దుచేసి కేవలం నాలుగు కోడ్ లను అమలు చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నదని, బిజెపి పాలన ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో మతోన్మాదులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించినదని, భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ లౌకిక రాజ్యాంగం ఉన్న భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నదని, బిజెపి ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు,కర్షకులు ,ప్రజలు, యువత కలిసి నడుం బిగించి పోరాటాలకు సిద్ధం కావాలని, వారు పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో గూడూరు సిఐటియు నాయకులు శాంతన్న. చనుగొండ్ల గ్రామంలో సిఐటియు సీనియర్ నాయకులు మాధవ కృష్ణయ్య. కోటయ్య. రామాంజనేయులు. సుధాకర్. మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు,,






