kiran24×7news …
కర్నూలు జిల్లా…
ప్రజలు స్వేచ్ఛగా , నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి…
కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు.
• ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే పోలీసుల కవాతు….
• ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.
• జిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు తెలిపారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు
జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్” సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు.
కర్నూలు సబ్ డివిజన్ , ఉలిందకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని ఉలిందకొండ, కొంగనపాడు, నాయకల్లు, పెద్దటేకూరు, చిన్నటేకూరు, లక్ష్మీపురం గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
ఉలిందకొండ ఎస్సై నరేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు సబ్ డివిజన్ , మాధవరం పోలీసుస్టేషన్ పరిధిలోని మాధవరం, మంత్రాలయం లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
మంత్రాలయం సిఐ ఎరిషావలి, మంత్రాలయం ఎస్సై గోపినాథ్ , మాధవరం ఎస్సై క్రిష్ణమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పత్తికొండ సబ్ డివిజన్, జొన్నగిరి పిఎస్ పరిధిలోని కడమకుంట్ల, శభాష్ పురం, జొన్నగిరి, దిగువ చింతలకొండ, పగిడిరాయి, కొత్తూరు గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
జొన్నగిరి ఎస్సై రామంజనేయులు మరియు పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.






