kiran24x7news:-
కలపరి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు.
ఈ సందర్భంగా కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న ద్వారా అనేక ఆబ్ది చేకూరాయి కావున మళ్ళీ సిఎంగా జగనన్న గారిని గెలిపించాలని, దీనికి గాను రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు..
కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు మాట్లాడుతూ తాను రాజకీయ గొడవలు, ప్రజల్లో కక్షలు పెంచేందుకు రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు, మంచి చేసేందుకు మాత్రమే వచ్చానని అన్నారు.. ఆసుపత్రికి సంబంధించిన ఏ అవసరం ఉన్న అర్థరాత్రి అయినా తనను కలువవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉండి, ప్రతి పేదవాడి ఇంటికి నేనే డాక్టర్ అవుతానని అన్నారు, అలాగే కోడుమూరులో పిల్లల భవిష్యత్తుకు బాధ్యత తీసుకుంటానని ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకునేందుకు వారికి దిశ నిర్దేశం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు, మరియు కోడుమూరులో సాగునీరు త్రాగునీరుకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు, కోడుమూరులో రోడ్డు సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామానికి లింకు రోడ్లను ఏర్పాటు చేస్తానని అన్నారు.. ఇలా కోడుమూరు ను ప్రతి అంశంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గుడిపాడు లక్ష్మికాంతారెడ్డి, వెంకటేష్, కలపరి గ్రామ నాయకులు గిడ్డయ్య, పురంధర్ రెడ్డి, రాజారెడ్డి, గుంటేప్ప, వెంకటేశ్వరరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, మనోహర్, కృష్ణారెడ్డి, సత్యరెడ్డి, ఎర్రన్న, దస్తగిరి, నరసింహ రెడ్డి, రుషిరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు






