kiran24×7news ;-
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడిని ఖండిస్తూ ఆదివారం గూడూరు నగర పంచాయతీ పరిధిలో నగర చైర్మన్ జే.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి పైన దాడి జరగడం పిరికిపంద చర్య అని ఈ చర్యను ప్రతి ఒక్కరు ఖండించవలసిన బాధ్యత ఉందని పేర్కొన్నారు . సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పై దాడి జరిగితే ఇక ముందు ముందు ఎటువంటి దాడులు సామాన్యుల పై జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల్లో కూటమి కి ఓటమి తప్పదని ఆ భయంతోనే ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈసారి ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత ప్రజల్లో పాతు కు పోతారని భయంతో కూటమి ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూన్నారనారు. దాడులకు భయపడే ప్రసక్తి లేదని ఇటువంటి చర్యలు పునరావృతం అయితే భవిష్యత్తులో ఎదురు దాడులు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిఎన్అస్లాం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి సభ్యులు ఎల్ వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు బి సుభాకర్ ,బి ప్రవీణ్ ,కౌన్సిలర్ మద్దిలేటి,దేవదాసు మనోహర్ మధు ,కొండగిరి గిడ్డయ్య, మానికింది రామన్న.. తదితరులు పాల్గొన్నారు.






