kiran24×7news : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
జయంతి వేడుకలను ఆదివారం గూడూరు నగర పంచాయతీలో కోట్ల టిమ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ముందుగా రాజారెడ్డి స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి గూడూరు పాత బస్టాండ్ ఆవరణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్, మాజి కేడీసీసీ డైరెక్టర్ రాజా రెడ్డి, మాజి కేడీసీసీ వైస్ ప్రెసిడెంట్ తులసి కృష్ణ, చెట్టు కింద నారాయణ, గూడూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు చెట్టు కింద సురేష్ ఉప్పరి లక్సమన్న మూలాగేరీ లక్సమన్న రేవుల గోవింద్ వాల్మీకి సంగం వైస్ ప్రెసిడెంట్ సంఘాల మధు అయ్యవారి నాయుడు తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ వై. నాగరాజ్ వి. పెద్ద రంగడు చేట్టు కింద సురేంద్ర హరి mgb youth సభ్యులు నరసింహ సూరి రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్ కుమార్ మాట్లాడుతూ మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాలు పాటిస్తామని తెలిపారు.
2024 ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో కోట్ల మార్క్ ఉంటుందని తెలిపారు. కోట్ల వర్గీయులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు నాయకులను ఎలా కాపాడుకోవాలో మన నాయకుడికి తెలుసని మనకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మూలగిరి కర్ణ కొండమీది కేశవులు గొల్ల శ్రీనివాసులు గుడిసె గిడ్డయ్య బొంతల మిన్నెల బాపల్ దొడ్డి లింగన్న కట్టెల సుంకన్న తదితర కోట్ల అభిమానులు కోట్ల టీం సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






