kiran24x7news:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

గూడూరు పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు మొదటిగా పట్టణంలోని బస్టాండ్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి మరియు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన కులహక్కులు కల్పించారని కాబట్టి ఆయన ఆశయ సాధనకు సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అనంతరం జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు నాయకులు రేమట వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు బుడంగలి షాషావలి సృజన్ వీర విజయ్ కుమార్ మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.