kiran24×7news ;

సిపిఐ పార్టీ రామచంద్రయ్య గారి కంకి కొడవలి గుర్తుకే ఓటు వేయాలని ,సిపిఐ కోడుమూరు మండల కార్యదర్శి బి రాజు తెలియజేశారు..నేడు క్రిష్ణగిరి మండలం, హంద్రీ ఎర్రగుడి గ్రామంలో కరువు పనులు చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి ఆయన మాట్లాడుతూ,,పత్తికొండ నియోజకవర్గం నుంచి సిపిఐ, సిపిఎం,,కాంగ్రెస్,,ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి పి రామచంద్రయ్య గారి కంకి కొడవలి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన తెలియజేశారు .

ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ,,ఉపాధి కూలీల కష్టాలు, కష్టజీవుల కష్టాలు, ప్రజల కష్టాలు తీరాలంటే ,కష్టజీవుల పార్టీ అయినటువంటి కమ్యూనిస్టు పార్టీ గుర్తు కంకి కొడవలి కే ఓటు వేసి గెలిపించాల,ని ఆయన తెలిపారు.గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశారని, ధరలను అధికంగా పెంచి, రైతులను ,పట్టించుకోకుండా కూలీలను పట్టించుకోకుండా, అనేక కష్టాలు పడుతున్న ప్రజలను విస్మరించారని ఆయన తెలిపారు .కర్నూలు జిల్లాలో కరువు విలయతాండవం ఆడుతుంటే, క్రిష్టగిరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదని ఆయన తెలియజేశారు .అందుకోసమే ఇండియా కూటమితో పోటీ చేస్తున్నటువంటి సిపిఐ రామచంద్రయ్య గారి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఉపాధి కూలీలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కోడుమూరు సిపిఐ నాయకులు ఆటో మధు, చిన్న బజారి, ఎరుకలి నాగన్న, గొల్ల సుంకన్న ,ఎర్రగుడి సిపిఐ నాయకులు నాయుడు, కత్తి సుంకన్న తదితరులు పాల్గొన్నారు.