kiran24×7news ;

గూడూరు మండలం జూలకల్లు, పొన్నెకల్లు గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..

ఈ సందర్భంగా గ్రామాల్లోకి విచ్చేసిన నాయకులకు ఘన స్వాగతం పలికిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు..

ఈ సందర్భంగా కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ విడుదల చేసిన వైసిపి మానిఫెస్ట్ ద్వారా పేద ప్రజలకు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ మరింతగా మంచి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.. వైసిపి ప్రభుత్వంతో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందని అన్నారు.. గతంలో టిడిపి హయంలో పథకాలు అందాలంటే మధ్యవర్తులకు లంచాలు ఇచ్చేవారని కానీ ఇప్పుడు అలాంటివి లేకుండా ఇంటికే నేరుగా పథకాలు అందించిన ఘనత జగన్ గారిది అని అన్నారు.. కోడుమూరు నియోజకవర్గం జగన్ అన్న నాయకత్వంలో మరింతగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.. డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికైనా ఆసుపత్రి విషయంలో సలహాలు సూచనలు అవసరమైతే అర్థరాత్రి అయినా ఫోన్ చేయవచ్చని ప్రతి పేదవాడి గడపకు తానే డాక్టర్ ను అవుతానని అన్నారు.. కోడుమూరు నియోజకవర్గంలో పేదలకు అందరికీ వైద్యం, విద్య అందేలా చూస్తామన్నారు.. అలాగే యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువకులకు ఉద్యోగకల్పనలో కృషి చేస్తానన్నారు..

రానున్న మే 13 ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, ఎమ్మెల్యేగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని ఎంపీగా డివై రామయ్య గారిని గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మౌలాలి, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం, పట్టణ కన్వీనర్ ఆభీలు నాయకులు ప్రతాప్ రెడ్డి, చిన్న లక్ష్మన్న, కౌన్సిలర్లు కలాం భాషా, కుమార్, మద్దిలేటి, విజేయుడు, దస్తగిరి, మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు నాయకులు తిమ్మారెడ్డి, రామిరెడ్డి, మినల్లా, గోపాల్, శివ, సుంకన్న, రాముడు, నడిపి సుంకన్న, రఘు, వెంకట్ రాముడు, శ్రీను, జూలకల్ గ్రామ నాయకులు దివాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాదిరెడ్డి, రఘురామిరెడ్డి, శశి రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, దానేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి, చెన్నకేశవరెడ్డి, వీరశేఖర ఆచారి, పెద్దయన్న, బజారి, మాజీ సర్పంచ్ పెద్ద బజారి,చెన్నయ్య, సుంకన్న, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.