Kiran24x7news:
మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు *గౌ శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు* డోన్ శాసన సభ్యులుగా గెలుపొందడంతో బుధవారం గూడూరు నుండి టిడిపి నేతలు, కోట్ల వర్గీయులు తెలుగు యువత కర్నూల్ పార్లమెంట్ కార్యదర్శి చరణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుడిపాడు ఆర్. చంద్ర రెడ్డి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ సుధాకర్ రెడ్డి మాజి కేడీసీసీ డైరెక్టర్ రాజా రెడ్డి ,మాజి నీటి సంగం అధ్యక్షులు చెట్టు కింద మాద్ధిలేటి వాల్మీకి సంఘం అధ్యక్షులు సంఘాల మధు రైతు సంఘం కార్యదర్శి రేవుల గోవిందు తెలుగు యువత ఉపాధ్యక్షులు వై నాగరాజు చెట్టు కింద నారాయణ ఉప్పరి లక్ష్మన్న ఉప్పరి మల్లికార్జున యు. రాముడు వసంత గారు పెద్ద రంగడు టీ.నాగరాజు బీసీ సెల్ అధ్యక్షులు చెట్టు కింద సురేష్ మినుగు కర్ణ మూలగిరి లక్ష్మన్న కొండమీది తిమ్మ గురుడు చెట్టు కింద గోపాల్ కేశవులు మహాత్మ యూత్ సభ్యులు మధు పరశురాముడు కాకి సుంకన్న ఎం.జి.బి యూత్ సభ్యులు నరసింహ సురేంద్ర హరి నాయకులు తదితరులు ముందుగా గూడూరు బస్టాండ్ ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఆవరణంలో బాణాసంచా కాల్చి  స్వీట్లు పంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పట్ల వర్షాన్ని వ్యక్తపరిచారు..

బస్టాండ్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు నిజమైన రాజ్యాంగం వచ్చిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అనంతరం డోన్ కు తరలి వెళ్లి మాజీ కేంద్ర మంత్రివర్యులు డోన్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసుర్య ప్రకాశ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. టిడిపి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.