kiran24x7news;
కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎలాంటి అధైర్పడకుండా ధైర్యంగా ఉండాలని కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కార్యకర్తలకు అండగా ఉంటామని వారు తెలియజేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తామన్న పథకాలు ఆకర్షితులై మనము ఓటమి చెందాము. కానీ వైఎస్ఆర్సిపి నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన అండగా ఉంటాము ఈ ఐదు సంవత్సరాలు వారికి వెన్నంటూ ఉంటాము. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు వైయస్సార్సీపి ప్రభుత్వం ఎలా పథకాలు అందించిందో తెలుగుదేశం ప్రభుత్వం వారు పెట్టిన మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ పథకాలు అందజేసే విధంగా వారు కూడా కృషి చేయాలని వారు అన్నారు. కోడుమూరు నియోజకవర్గం నుంచి సుమారు 80 వేలు మంది ప్రజలు మనకు అండగా నిలిచారు.
మనము చేసిన లోపల సరిచేసుకొని మరింత కష్టపడి మనం కూలిపోయిన 10% ఓట్లను మించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి అండగా ఉండాలని వాళ్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు రఘునాథ్ రెడ్డి, ప్రసన్నకుమార్, కార్పొరేటర్ విక్రం సింహారెడ్డి, వైస్ ఎంపీపీ నెహెమ్యా, గూడూరు మున్సిపల్ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లు అస్లాం భాష, చిన్న లక్ష్మన్న మండల కన్వీనర్లు మహబూబ్ బాషా, రమేష్ నాయుడు, మాజీ మండల ఉపాధ్యక్షులు డి వాసు, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, పాండు రంగన్న, కౌన్సిలర్ మద్దిలేటి, ప్రసన్నకుమార్, మల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి చిన్న లక్ష్మన్న, ఎస్ఎం భాషా, గుడిపాడు లక్ష్మీకాంతరెడ్డి, లింగమయ్య, ఏసేపు, సురేష్, శాంతులు, ఆదాం, వెంకటేష్, వెంకటేష్, అనిల్ భాష, అహ్మద్ అలీ, వెంకటేష్, భాస్కర్, ఫిరోజ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






