కిరణ్24×7న్యూస్,గూడూరు,( జూన్,26)
గూడూరు నగర పంచాయతీ పరిధిలో దోమల నివారణ మరియు పారిశుధ్యం పనులపై చర్యలు ముమ్మరం చేసినట్లుగా గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జె.వెంకటేశ్వర్లు, కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం గూడూరు పట్టణంలో చైర్మన్ మరియు కమిషనర్ ఆదేశాల మేరకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ రవి ఆధ్వర్యంలో పట్టణంలోని మాలగేరి, సంజీవ్ నగర్, తెలుగు వీధి, ఎరుకల కాలనీ, దెయ్యం కట్ట, రాజా వీధి, కోడుమూరు రోడ్, కడ్తల్ వీధి మరియు జండా కట్ట లైన్ కాలనీలలో దోమల నివారణకై కాలువలలో స్ప్రే మందులు కొట్టడం మరియు పారిశుద్ధం పనులను నిర్వహించారు. ప్రతిరోజు పట్టణంలోని కాలనీలలో పారిశుద్ధ్యం పనులపై దృష్టి సాగించి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు చేపట్టినట్టుగా వారు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.






