కిరణ్24×7న్యూస్.. (గూడూరు జులై 1). గూడూరు నగర పంచాయతీ పరిధిలో సోమవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో  లబ్ధిదారులకు పింఛన్లను అందజేసిన టిడిపి పార్టీ నాయకులు రేమట వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు బుడంగలి, షాషావలి, సింగనగేరి నాయకులు బాబు, గిడ్డయ్య, మద్దిలేటి, నాయుడు, కర్ణ మరియు నాయకులు చంటి, కృష్ణ మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు.. ఈ సందర్భంగా నాయకులు రేమట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తానని చెప్పి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదటి సంతకం 3000 రూపాయల పింఛన్లు 4000 రూపాయలు పెంచడం జరిగినది తెలిపారు. పింఛన్లను ఏప్రిల్ నెల నుంచి పెంచుతూ  మూడో నెలకి 3000 మరియు పెంచిన 4000 రూపాయలు కలిపి ఈరోజు లబ్ధిదారులకు 7000 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా  లబ్ధిదారులు  హర్షం వ్యక్తం చేస్తూ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.