కిరణ్24×7న్యూస్,( జూలై, 1).
గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో సోమవారం సిఐ శ్యామరావు జన్మదిన వేడుకలను అభిమానులు సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న సిఐ శ్యామరావును పూలమాలతో శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీనుల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఉచిత వైద్య శిబిరాలు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెంచికలపాడు, ఎంపిటిసి మద్దిలేటి కర్ణం యుగంధర్, దయ, నాగ సుంకయ్య , గోపాల్ , సురేష్ రెడ్డి, సల్కాపురం జయన్న,శేఖర్, మధు , సురేష, ఎల్లారెడ్డి, శంకర్, మురన ,తదితరులు పాల్గొని జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు.






