కిరణ్24×7న్యూస్,గూడూరు (జులై,5)
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా 6వ తేదీ అనగా శనివారం గూడూరు పట్టణంలోని పశు వైద్య కేంద్రంలో మండలంలోనిపెంపుడు కుక్కలు మరియు వాటి పిల్లలకు ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల ను వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా పశు వైద్య కేంద్రం ఏడి శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ యజమానులకు సంబంధించిన పెంపుడు కుక్కలు మరియు వాటి పిల్లలకి జూలై 6 వ తేదిన సమీప పశువైద్య కేంద్రంలో ప్రభుత్వం అందించే ఉచిత యాంటీ రేబిస్ వ్యాధి టీకాను కచ్చితంగా వేయించుకోవాలని సూచించారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






