గూడూరు న్యూస్ (కిరణ్)
విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సాకారంతో కోడుమూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ గా గూడూరు పట్టణానికి చెందిన మల్లాపు చిరంజీవిని ఎన్నిక అయ్యారు. ఈ మేరకు ఆయనను కోడుమూరు పట్టణంలోని సమావేశంలో టిడిపి నేతలు కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు గూడూరు పట్టణం నుండి టిడిపి యువ నేత సృజన్ కౌన్సిలర్ బుడ్డoగలి, టిడిపి నాయకులు ఇసాకు మాజీ కౌన్సిలర్ అడివప్ప మధు మరియు స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లాపూర్ చిరంజీవి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.






