బిడ్డల భవిష్యత్ కోసమే `కోటి సంతకాలు
కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్
గూడూరు పట్టణంలో రచ్చబండ- కోటి సంతకాల సేకరణ..
కిరణ్ 24×7 న్యూస్:
మన పిల్లల వైద్య విద్య కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ఉద్యమంలో పాల్గొని కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలనికుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల అనుసరంగా కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు.
కోడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలో గురువారం చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, గూడూరు టౌన్ కన్వీనర్ అబెల్, కోడుమూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు, కౌన్సిలర్ కుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ-కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వైఎస్ఆర్ సర్కిల్లో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న దృఢ సంకల్పంతో 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టారన్నారు. పేదలకు అందాల్చిన వైద్యాన్ని కార్పొరేట్ల చేతిలో అప్పణంగా పెట్టేందుకు నేడు చంద్రబాబు ప్రభుత్వం ఆ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుండటం దారుణమన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే గ్రామాలలో సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలియజేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసి చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రాలకు చరమ గీతం పాడటం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు వైస్ చైర్మన్ లక్ష్మన్న, కౌన్సిలర్లు నందకిషోర్, డ్రైవర్ మద్దిలేటి, కో ఆప్షన్ మెంబర్ మదర్, కర్నూలు మండల ఉపాధ్యక్షులు నెహమియా, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, గూడూరు మండల కన్వీనర్ రామాంజనేయులు గూడూరు మండల కోఆప్షన్ సభ్యులు దౌలత్, వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి మహేశ్వర రెడ్డి, కార్మిక జిల్లా కార్యదర్శి దివాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ కార్యదర్శి మాధవస్వామి, కర్నూలు మండల ఎస్ సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గూడూరు మండల ట్రెజరీ రామచంద్రుడు, గూడూరు టౌన్ వైస్ కన్వీనర్లు గంగాధర్, ఆంజనేయులు, హబీబ్, గిడ్డయ్య, రవి ప్రతాప్, ప్రభాకర్, శివ, మధు, సుంకన్న, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.







