రోడ్డు భధ్రత పై అవగాహన కు హెల్మెట్ , ఆటోల ర్యాలీని ప్రారంభించిన ….. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కిరణ్ 24×7 న్యూస్:
* హెల్మెట్ ధరించి అవగాహన బైక్ ర్యాలీ లో పాల్గొన్న… జిల్లా ఎస్పీ.
* ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే.
* హెల్మెట్ ధరించడం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం.
సోమవారం కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజలకు రోడ్డు భధ్రత , ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు హెల్మెట్ , ఆటోల ర్యాలీ ని కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.
హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే విధంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
హెల్మెట్ ధరించి అవగాహన బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ అవగాహన ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్,కలెక్టరేట్ మీదుగా సి. క్యాంపు సెంటర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మీడియాతో మాట్లాడుతూ….
ఈ రోజు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా కర్నూలు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరిగిన ఆడియోలను ఆవిష్కరించడం జరిగిందన్నారు.
రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ ధరించి ఉంటే చనిపోకుండా బతికి బయటపడే అవకాశం ఉండేదేమో అనే విధంగా భాధితుల కుటుంబాలు చెప్పడం జరిగిందని, ఆ రోడ్డు ప్రమాదాల విడియోలతో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ భాద్యతగా హెల్మెట్ ధరించాల్సిందేన్నారు
మొదటి సారిగా జరిమానాలు విధించకుండా హెల్మెట్ ధారణ పై అవగాహన కల్పిస్తామన్నారు.
తర్వాత కౌన్సిలింగ్ చేస్తామన్నారు.
రాబోయే రోజులలో ద్విచక్ర వాహనదారులు ISI-మార్క్ ఉన్న హెల్మెట్లను ధరించాల్సిందేనన్నారు.
అందరూ హెల్మెట్లు కోనుగోలు చేసి బైకులు నడిపే విధంగా, హెల్మెట్లు వినియోగించే విధంగా సమయం ఇస్తామన్నారు.
సాయంత్రం వేళల్లో పట్టణంలోని రద్దీ ప్రాంతాలు, ట్రాఫిక్ జంక్షన్ లలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన విడియోలతో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు.

రోడ్డు ప్రమాదాల విడియోలను చూసి ఆ భయంతోనైనా ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లు ధరించి బైక్ లు నడిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించేందుకు గట్టిగా కృషి చేస్తామన్నారు.
రోడ్డు భద్రత పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు , అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతి పౌరుడు తన భద్రతకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు చేపడుతున్నారన్నారు.
ఈ అవగాహన ర్యాలీ లో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ , సిఐలు మన్సురుద్దీన్, విక్రమసింహా, తేజా మూర్తి, చంద్రబాబునాయుడు, మధుసుధన్ రావు, పార్థసారథి, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సై లు, ట్రాఫిక్ పోలీసులు, సివిల్ , ఎఆర్ , ఆయా షోరూం యువకులు, ఆటోల డ్రైవర్లు పాల్గొన్నారు.






