యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేస్తున్న కర్నూలు పోలీసులు …
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ఈవ్‌ టీజింగ్‌, ఆకతాయి పనులకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్ధల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

ఈవ్ టీజింగ్ , ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని లేదా డయల్ 112 గాని లేదా డయల్ 100 గాని సమాచారం అందించాలని విద్యార్ధిని, విద్యార్దులకు అవగాహన చేస్తున్నారు.

జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధులలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ పాల్పడే వారి పై నిఘా ఉంచి ఈవ్ టీజింగ్ బీట్స్ పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు.