గ్రామ పంచాయతీల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం కోడుమూరు ఎమ్మెల్యే..
కిరణ్ 24×7 న్యూస్:
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానం ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్ పంచాయతీ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తో కలసి కార్యక్రమంలో పాల్గొన్న కొడుమూరు ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి*

ఈ సందర్భంగా కోడుమూరు ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ పంచాయతీ ఆఫీసు లు ప్రారంభం కావడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించిందన్నారు. కనీసం గ్రామ పంచాయతీ సర్పంచులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉండింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత గ్రామాలలో సీసీ రోడ్లు ,త్రాగునీరు , విద్యుత్తును పునర్నిర్మించి పంచాయతీ సేవలను మెరుగు పర్చడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని గ్రామ పంచాయతీలు ఏ విధమైన ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో
స్థానిక జిల్లా పరిధిలోని ప్రభుత్వ యంత్రాంగం , కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది.