సి.బెళగల్లో కోటి సంతకాల సేకరణ సక్సెస్…
కిరణ్ 24×7 న్యూస్:
సంతకాలు చేసిన పేపర్లు పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ కి అందజేత
పార్టీ శ్రేణులను అభినందించిన డాక్టర్ సతీష్
వైఎస్ జగన్ తీసుకువచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమని వైఎస్సార్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్అన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పేద, బడుగు,బలహీనవర్గాల వారి అభిప్రాయాల్ని సంతకాల రూపంలో సేకరించామని, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. సి.బెళగల్ మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి కావడంతో శనివారం ఆ పేపర్లను మండల పార్టీ నాయకులు డాక్టర్ సతీష్ కి అందజేశారు. ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసిన మండల పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే వైద్య విద్య పూర్తిగా కార్పొరేట్ కబంధ హాస్తాల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్య విద్యను ప్రభుత్వమే పేద విద్యార్థులకు ఉచితంగా అందించాలని అన్నారు. ఈ నెల 13వ తేదీన అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఉన్న సంతకాల పత్రాలను ఓ ప్రత్యేక వాహనంలో కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లికి పంపిస్తామని తెలిపారు. ఈ నెల 16వ తేదీన కోటి సంతకాల సేకరణ, ప్రైవేటీకరణ వల్ల నష్టాన్ని తెలియజేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి గవర్నర్‌కి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి బెలగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, కోడుమూరు మండల కన్వీనర్ రమేష్ నాయుడు, బూత్ కమిటీ జిల్లా కార్యదర్శి తులసి రెడ్డి, కోడుమూరు నియోజవర్గం డాక్టర్స్ వింగు విభాగం అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు హారున్, మండల ట్రెజరర్ వెంకటేష్, మండల వైఎస్ఆర్ సిపి ఉపాధ్యక్షులు లచ్చప్ప,మండల ప్రధాన కార్యదర్శి బాయి కాటి మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.






