కోడుమూరులో టీడీపీకి భారీ షాక్..
సి.బెళగల్ లో 150 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరిక..
కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సి బెలగల్ మండలంలోని కంపాడు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు, అభిమానులు, పెద్దలు, యువతతో కలిసి మొత్తం 150 కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. 
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కొత్తగా చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కోడుమూరు ప్రాంతంలో ప్రజలు టీడీపీపై విసుగు చెందారని, అభివృద్ధి, సంక్షేమం ఆగిపోయిందన్నారు. ప్రజల పక్షాన నిలిచిన వైయస్ఆర్సీపీ వైపు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక న్యాయం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచినట్లు తెలిపారు. పార్టీలో చేరిన ప్రజలు మాట్లాడుతూ..

టిడిపి ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదన్నారు, గ్రామాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం నేలమీద పనిచేస్తుందని నమ్మకంతో ఆ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, జిల్లా బూత్ కమిటీ కార్యదర్శి తులసి రెడ్డి , నాయకులు కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు..







