అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
గూడూరు ఎస్సై బి. రాజా కుళ్లాయప్ప.

కిరణ్ 24×7 న్యూస్:

గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజా కుళ్లాయప్ప తెలిపారు.

గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై విలేకరులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ట్రాఫిక్ అంతరాయ సమస్య ఎక్కువగా ఉందని తోపుడు బండ్లు రోడ్ల పక్కన ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారుల షాపులు వారు సహకరించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.

ఆటో లు ద్విచక్ర వాహనదారులు రహదారుల మధ్యలో వాహనాలను నిలపరాదని మరియు మద్యం సేవించి వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేనిపక్షంలో వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పట్టణంలో బెల్ట్ షాపులు, మట్కా జూదం గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ఇప్పటితో మానుకొని పోలీసు వారికి సహకరించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎస్సై  రాజా కుళ్లాయప్ప హెచ్చరించారు.

అనంతరం గూడూరు మండల జేఏసీ విలేకరుల సంఘం ఎస్సై ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ విలేకరులు  దౌలత్, శరత్, కిరణ్, మహబూబ్ బాష, ఇస్మాయిల్, రఘు,డాక్టర్ అబ్దుల్లా, షేక్షావలి, ఇషాక్, మద్దిలేటి, మిన్నేళ్ల, తదితరులు పాల్గొన్నారు.