*ఉపాధి హామీ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి*

*కర్నూలులో బికెఏంయు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి*

కిరణ్ 24×7 న్యూస్:

కర్నూలులో ఉపాధి హామీ కూలీల రక్షణకై జనవరి 10వ తేదీన జిల్లా పరిషత్ హలులో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రాజు, జిల్లా సమితి సభ్యుడు శ్రీరాములు గౌడ్ పిలుపునిచ్చారు.శుక్రవారం బెళగల్ మండల సీపీఐ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీలకు అన్యాయం చేసే విధంగా తెచ్చిన కొత్తబిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించేలా శాసనసభలల్లో ఆమోదం చెయ్యాలని అందుకు శాసనసభ్యులు మద్దతుగా నిలవాలని వారు కోరారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంపై తీవ్రమైన దాడి మొదలైందని,వ్యవసాయ కూలీలకు పట్టేడన్నం పెట్టె ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదలనోట్లో మట్టి కొట్టె విధంగా బిజేపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జి రాంజి అనే కొత్త బిల్లును తీసుకురావడం చాలా దారుణమన్నారు. కొత్త బిల్లును పార్లమెంట్, శాసనసభ లల్లో సభ్యులు వ్యతిరేకించి ఉపాధి కూలీలకు అండగా నిలవాలని వారు కర్నూలు జిల్లా ఉండే శాసనసభ్యులకు, గ్రామ పంచాయతీ సర్పంచులను కోరుతున్నాము. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి సి. మల్లిఖార్జున, పక్కిరన్న, వెంకటేష్, పెద్దయ్య, బజారి, మురళి, చిన్న ఈరన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.