గ్రామ కమిటీల పాత్రే పార్టీ బలోపేతానికి కీలకం

కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్..

కిరణ్ 24×7 న్యూస్:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాల్సిందేనని, గ్రామ స్థాయి కమిటీలే పార్టీకి పునాదులని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్  అన్నారు.

పార్టీకి నిబద్ధతగా, నిరంతరం పనిచేసే కార్యకర్తలనే గ్రామ కమిటీల్లో నియమించాలని ఆయన సూచించారు. సోమవారం కర్నూలు న‌గ‌రంలో లక్ష్మి కళ్యాణమండపంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వ‌హించిన జిల్లా స్థాయి పార్టీ సంస్థాగ‌త నిర్మాణ స‌మావేశంలో

నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూల్ పార్లమెంట్ అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఇంచార్జ్ శ్రీదేవి, ఎమ్మిగనూరు ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, మేయర్ బివై రామయ్య, సెంట్రల్ పార్టీ ఆఫీసు నుంచి మధుసూదన్ రెడ్డి, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ స‌తీష్  మాట్లాడుతూ కోడుమూరు నియోజవర్గంలో కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, “పార్టీ వృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తల ఆలోచనలే పార్టీ భవిష్యత్‌ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తాయి. పార్టీ భవిష్యత్‌ పూర్తిగా కార్యకర్తల చేతుల్లోనే ఉంది. మీరే పార్టీ దిశా నిర్దేశకులుగా నిలిచి, ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలి” అని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామం నుంచి పార్టీకి విశ్వాసంతో పనిచేసే కార్యకర్తలను ఎంపిక చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వచ్చే ఫిబ్రవరి నెలలోపు కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి” అని ఆయన సూచించారు. భవిష్యత్తులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా లభిస్తుందని భరోసా ఇచ్చారు.