kiran24×7news ..

*సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర విజయవంతం చేసిన ప్రజానీకానికి కృతజ్ఞతలు*

కోడుమూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి, తమ అభిమానాన్ని చాటుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసి, మళ్లీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని, ఫ్యాన్ గుర్తుకే ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గార్లకు ఓట్లు వేసి గెలిపిస్తామని తెలిపినందుకు ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు.. అలాగే కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన కోడుమూరు నియోజకవర్గ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు..

ఈ పత్రికా సమావేశంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షులు రమేష్ నాయుడు, ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ మధులు, ఎంపీటీసీ రాఘవేంద్ర, లింగన్న, లింగమయ్య, వార్డు మెంబర్ విష్ణు దాసు, రవి, లింగమూర్తి, శ్రీనివాసులు, రవికుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు