*జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో చేర్చాలి*
– మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి
– జర్నలిస్టుల, మీడియా సంస్థల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
– మజీదియా వేజ్ బోర్డు సిఫారసులను అమలు చేయాలి
*ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీకి వినతి పత్రం అందజేత*
*కర్నూలు, మార్చి 23:*
జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని అన్ని రాజకీయ పార్టీలు తమ. మ్యానిఫెస్టోలో చేర్చాలని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు జీ. కొండప్ప, కే నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్ చంద్ర శేఖర్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఎన్. రాజు, శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుంకన్న డిమాండ్ చేశారు. ప్రముఖ జర్నలిస్ట్, స్వాతంత్ర్య సమర యోధులు సర్దార్ షహీద్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ.. ఐజేయూ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోరికల దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ప్రింట్ మీడియా ఉండేదని, ప్రస్తుత ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్, యూట్యూబ్, సోషల్ మీడియా అంటూ పరిధి పెరిగిందని అన్నారు. అయితే మీడియాని పర్యవేక్షించేందుకు మీడియా కమిషన్ మాత్రం ఏర్పాటు చేయలేదన్నారు. 1978, 1982 లో ఏర్పాటు చేసిందే అన్నారు. అలాగే జర్నలిస్టుల, మీడియా సంస్థల పై రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయని, రక్షణకు జాతీయ స్థాయిలో రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే మజీదియా వేజ్ బోర్డు సిఫార్సుల మేరకు వర్కింగ్ జర్నలిస్టులకు జీతాలు పెంచాలని కోరుతున్నా పాలకుల్లో చలనం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల కు మాత్రం ఇప్పటికే మూడు సార్లు వేతనాలు పెంచారని, జర్నలిస్టులకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క సారి కూడా వేతనాలు పెంచలేదని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని రాజకీయ పార్టీల నేతలు హామీలు ఇస్తున్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదన్నారు. హామీలు కాకుండా ప్రతి పార్టీ జర్నలిస్టుల కోరికలను తమ మ్యానిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిరంజీవి, వీడియో గ్రాఫర్ ల అధ్యక్షుడు స్నేహల్, కార్యదర్శి కిరణ్,
సీనియర్ రిపోర్టర్స్ శ్రీనాథ్ రెడ్డి, మల్లికార్జున, మగ్బుల్,హుసేన్,రఘు,సురేష్,రాజు,అసిఫ్,సుధాకర్,ఫోటో ,వీడియో గ్రాఫర్స్ మధు,రామ్మోహన్, రమేష్,సురేష్,శేఖర్ గంగాధర్, తదితరులు పాల్గన్నారు.






