kiran24x7news:-
ఇంటింటికి ప్రచారంలో వైసీపీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు..
కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు.. వీరిని గ్రామంలోకి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికిన నాయకులు, గ్రామస్థులు.

ఈ ప్రచారంలో భాగంగా *కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి* గారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబం ఏదో రకంగా లబ్దిపొందిందని, జగనన్న అన్ని వర్గాలకు, కులమతాలకు అతీతంగా మంచి చేసారని,ప్రజలకు మంచి చేస్తేనే ఓటు వేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్ అని అన్నారు.. కావున మళ్ళీ సిఎంగా జగనన్న గారిని గెలిపించాలని కోరారు.. చంద్రబాబు చేసిన కుట్రలతో వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే వస్తున్న పెన్షన్ లు ఆగిపోయి మళ్ళీ పాత రోజులు వచ్చేలా చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నాయకులకు బుద్ది వచ్చేలా, డిపాజిట్ గల్లంతు అయ్యోలా తీర్పునివ్వాలి అని కోరినారు.. అలాగే కోడుమూరు నియోజకవర్గం సుఖసంతోషాలతో ఉండాలంటే రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు.. అనంతరం ముడుమలగుర్తి గ్రామంతో అక్కడి ప్రజలతో ఉన్న అనుబంధం గూర్చి పంచుకున్నారు.. గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..

*కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్* గారు మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఇంటికి తానే డాక్టర్ అవుతానని, ఆసుపత్రికి సంబంధించిన ఏ అవసరం ఉన్న అర్థరాత్రి అయినా తనను కలువవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉండి, వైద్య సహాయం అందిస్తానని అన్నారు.. కోడుమూరు నియోజకవర్గ పిల్లల భవిష్యత్తుకు బాధ్యత తీసుకుంటానని ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకునేందుకు వారికి దిశ నిర్దేశం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు, పాఠశాలలను దత్తత తీసుకొని నాణ్యమైన విద్య అందేలా చూస్తానని అన్నారు, మరియు రైతులు సాగునీరు, ప్రజలు త్రాగునీరుకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు.. అలాగే రోడ్డు సమస్యలు లేకుండా ప్రతి గ్రామానికి రోడ్డును ఏర్పాటు చేస్తానని, ప్రతి గ్రామానికి లింకు రోడ్లను ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తా అని అన్నారు.. ఇలా కోడుమూరు నియోజకవర్గంను ప్రతి అంశంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి, మోడ్రన్ కోడుమూరు గా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి రఘునాథరెడ్డి, ఎంపిపి రుతమ్మ, 40వ వార్డు కార్పొరేటర్ విక్రంసింహరెడ్డి, యం. శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపిపి విజయ్ కుమార్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, కిష్టాపురం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, ముడుమలగుర్తి గ్రామ నాయకులు విక్రమ్ రెడ్డి, ప్రహ్లాద రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, రఘు రెడ్డి, గజేందర్ రెడ్డి, వెంకటగిరి శివుడు, గిరి, మద్దిలేటి, సుంకన్న, సురేంద్ర రెడ్డి, దుబ్బన్న, సోమన్న, శివ, రాజేష్, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.






