*కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టిన పూడూరు గ్రామస్తులు..*
kiran24×7news : కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం పూడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు మరియు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ గార్లు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు..ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామంలోని సుంకులమ్మ ఆలయం,దర్గా, చర్చిల నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామంలో తాను చేసిన అభివృద్ధి పనులను గ్రామ ప్రజల వివరించారు తనను ఎమ్మెల్యేగా రాంపుల్లయ్య యాదవ్ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే శక్తివంచన లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే చూపిస్తామని మిగతా పార్టీల నాయకుల మాదిరిగా కేవలం స్వార్ధపూరితమైన పనులకు మేము వ్యతిరేకమని ఎవరో ఒకరు సిఫారసు చేస్తే పనులు చేసే వ్యక్తులం కాదని నియోజకవర్గంలోని సామాన్య ప్రజలు ఎల్లప్పుడు అండగా ఉంటూ ఏదైన సమస్య వస్తే నేరుగా తమ వద్దకు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటే అటువంటి వారికి అండగా ఉంటామని మే 13 వ తారీకున జరగబోయే ఎన్నికలలో రెండు ఓట్లను హస్తం గుర్తుకు వేసి వేయించి తమను గెలిపించాలని ఓటర్లను ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ గారు,ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు అభ్యర్థించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కె.బాబురావు గారు,NSUI రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ గారు,డీసీసీ సెక్రటరీ ఇలియాస్ భాష,డీసీసీ మహిళా అధ్యక్షురాలు ప్రమీల గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మురళీకృష్ణ అభిమానులు రాంపుల్లయ్య యాదవ్ గారి అభిమానులు పాల్గొన్నారు..






